పుట:మధుర గీతికలు.pdf/287

ఈ పుట ఆమోదించబడ్డది


'ఏమి చెప్పుదు ? మీపట్టపేన్గు చచ్చె.'
'పట్టపేనుంగె - చచ్చెనా ?- ఎట్టు చచ్చె ?'
'శక్తి మించినపని చేయ చచ్చుఁ గాదె?'
'ఏమిపని చేసె? '
                      'దిన మెల్ల నేటినుండి
మోసికొని వచ్చె జలమును మోటబండ్ల.'
'బండ్లపై జల మేల కావలసివచ్చె ?'
'మంట లార్పఁగ.'
                   'ఎవరియి ల్లంటుకొనియె ?'
'ఎవరిది కాదు మీయిల్లె.'
                         'ఎట్లు కాలె?'
'కాఁగడా లంటి.'
                     'ఏటికి కాఁగడాలు ?'
'అక్కటా? ఎట్లు తెలుపుదు, అమ్మగారు
రాత్రివేళను కాలధర్మంబు నొందె.'
'సేవకా ! ఏమి యంటివి, చెప్పు మయ్య
అమ్మ మృతి నొందెనా, ఏమివ్యాధిచేత?'