పుట:మధుర గీతికలు.pdf/286

ఈ పుట ఆమోదించబడ్డది

చావుకబురు


ధనికుఁడగు నొక్కవణిజుని తనయుఁ డొకఁడు
చాలకాలము దూరదేశమున నుండ,
సేవకుఁడు వచ్చె నాతనిచెంత; కంత
జరిగె వారి కీరీతి సంభాషణంబు;
'ఏమిపని గల్గి వచ్చితి విచటి కిపుడు ?'
'స్వామి ! మిము జూచుకాంక్షచే వచ్చినాఁడ.'
'ఓరి ! నాకుక్క బాగుగా నున్న దంటర ?'
'ఇంక మీకుక్క యెక్కడ ?'
                            'ఏమి యయ్యె?'
'వెక్కసంబుగ మాంసంబు మెక్కి చచ్చె.'
'ఏమిమాంసము తిని చచ్చె?'
                             'ఏన్గుమాంస:"
'మేన్గుమాంనము దానికి నెట్లు దొరకె ?'