పుట:మధుర గీతికలు.pdf/285

ఈ పుట ఆమోదించబడ్డది


మగుడ ముందున కాతండు మొగము త్రిప్పె,
ముందు వెనుకకు, వెనుకకు ముందు కిట్లు,
తేపతేపకు దిన మెల్లఁ ద్రిప్పెఁ గాని,
పిలక యెప్పటితీరున వ్రేలె వెనుక.

సారెసారెకు కుమ్మరిసారెరీతి
తలను గిరిగిర మంచు నాతండు త్రిప్పె;
ఎన్నిసారులు త్రిప్పిన యేనిఁ గాని,
పిలక యెప్పటిచొప్పున వ్రేలె వెనుక.

ఏటిచిత్రమొ కాని - ఆనాఁటఁగోలె
బొంగరమురీతి నాతనిబుఱ్ఱ తిరిగె;
ఎట్టు లేరీతి తిరిగిన యేనిఁగాని..
పిలక యెప్పటిచొప్పున వ్రేలె వెనుక.