పుట:మధుర గీతికలు.pdf/284

ఈ పుట ఆమోదించబడ్డది

పిల్లసిగ


సింహపురమునఁ గలఁ డొక్కసిద్ధవరుఁడు,
సోముఁ బోలిన నెమ్మోముగోమువాఁడు;
వాని లావణ్యలక్ష్మికి వన్నె వెట్టె
వెనుక నల్లాడు నల్లారు పిల్లపిలక.

ఆతఁ డొకనాఁడు సిగ దువ్వి యద్దమందు
తనదురూపంబు గాంచి సంతసము నొంది
"అకట! యీసిగ వెనుక వ్రేలాడుకంటె
ముందుగా నున్న నింకను మురువు గాదె ?"

అంచు నొక్కింతతడవు యోచించి యతఁడు
తుదకు నొక్క యుపాయంబు మదికిఁ దట్ట,
తన మొగంబు గిరుక్కున వెనుకఁ ద్రిప్పె;
పిలక యెప్పటియట్టుల వ్రేలె వెనుక.