పుట:మధుర గీతికలు.pdf/281

ఈ పుట ఆమోదించబడ్డది


నొగులుచే వాఁడు మూల్గుచు పొగులుచుండ
పరుగుపరుగున పొరుగువా రరుగుదెంచి
నెత్తుటను దోఁగు నాతనినెమ్మొగంబు
చూచి, శోకంబు చోద్యంబు స్దుడిగొనంగ

"గంగిగోవును బోలు నీజంగమయను
దౌడమీదను కఱచె నీ పాడుకుక్క;
'ముద్దు చేసిన శునకంబు మూతి కఱచె'
అనెడి పెద్దల వాక్యంబు వ్యర్థ మగునె ?

చచ్చునే కాని మనుజుండు పిచ్చికుక్క
కఱవ, క్రమ్మఱ బ్రదుకుట కలదె ?" యంచు
ఉస్సురసు రని వేడినిట్టూర్పు పుచ్చి
వీడి రాసలు వాని జీవితముగూర్చి.

ఎల్ల రిఁక వాఁడు బ్రతుకుట కల్ల యనిరి,
కాని వారలపలుకులే కల్ల లయ్యె;.
ఏమిచిత్రమొ - ఇంతలో నీల్గె కుక్కు,
ఉసురు దాలిచె వాఁ డెంత వినపువిత్తొ ?