పుట:మధుర గీతికలు.pdf/280

ఈ పుట ఆమోదించబడ్డది


నిగమవిదుఁ డంచు సత్కర్మనిరతుఁ డంచు
నుతు లొనర్తురు జను లెల్ల నతనిగూర్చి;
ఎపుడు చదివెనొ వేదంబు లెఱుఁగ రెవరు,'
ఏమి సలిపెనొ సత్కర్మ లెఱుగ రెవరు.

'దీనచింతామణి' యటంచు, 'దానకర్ణు',
డంచు బిరుదంబు లెన్నొ యార్జించె నతఁడు;
ఇట్టి లోకైక విఖ్యాతి, యిట్టి బిరుదు
లెట్లు వానికి కలిగెనో యెఱుఁగ రెవరు.

వానిఁ బొడఁగని గోముఖవ్యాఘ్ర మనుచు
గొణుగుచుందురు కొందరు; 'కుక్క కూయ
చెడునె జంగంబుపరు' వని చిత్తమందు
లేశ మేనియు నాతండు లెక్కగొనఁడు.

మక్కువ నతండు నల్లని కుక్క నొకటి
పెంచుచుండెను; ఒకనాఁడు వేడు కలర
దొనితో నాడ, నాతనిదౌడ నొడిసి
పీకె నయ్యది అక్కటా! పిచ్చియెత్తి.