పుట:మధుర గీతికలు.pdf/278

ఈ పుట ఆమోదించబడ్డది


దానిపోరున కొక్కింత తాళలేక
మరల విప్రుఁడు వైద్యునిదరికి నేగి,
నెత్తి నోరును లబ్బున మొత్తుకొనుచు
ఇట్టు లాతనితో మొఱ్ఱవెట్టుకొనియె:

"కొలువఁబోయిన గుడి మీఁదఁ గూలినట్లు,
మూఁగ మాన్పిన, నది యట్టె ఱాఁగ యయ్యె;
చెలిని గ్రమ్మఱ మూఁగఁగాఁ జేసితేని
నీదుతలనిండ విత్తంబు నించువాఁడ.”

అనుడు, నాతనితో వైద్యుఁ డనియె “విప్ర!
ఎట్లొ మూఁగను మాటాడునట్లు చేయ
శక్య మయ్యెను గాని, నాసాధ్యమగునె
వాఁగుబోతును గ్రమ్మఱ మూఁగఁజేయ ?"

21