పుట:మధుర గీతికలు.pdf/276

ఈ పుట ఆమోదించబడ్డది

మూఁగ యిల్లాలు


పాఱుఁ డొక్కఁడు కలఁ డొక్క పట్టణమున;
వాని యిల్లాలు సద్గుణవంతురాలు,
బుద్ధులకు ప్రోవు, సోయగంబునకు తావు,
చక్కగా నింటిపను లెల్ల చక్కఁబెట్టు.

మగనికనుసన్న మెలఁగుచు మగువ యెపుడు
ఆకుమఱుఁగున పిందెయై యలరియుండు;
ఎందు నాపెకు లోప మొక్కింత లేదు,
అకట ! మూఁగతనం బది యొక టె కాని.

దాని కెంతయు దురపిల్లి ధరణిసురుఁడు
శస్త్రవైద్యమునందు ప్రశస్తుఁడైన
వెజ్జుకడ కేగి యంతయు విన్నవింప,
వైద్యుఁ డీరీతి వచియించె వానితోడ:

19