పుట:మధుర గీతికలు.pdf/275

ఈ పుట ఆమోదించబడ్డది


'ఈ పిశాచంబు నా కేడ దాపరించె'
ననుచు నొకరేఁగువృక్షంబునండఁ జేర్చి,
'అదిగొ ! నాటక మాడుచో' టనుచు దాని
నచట దిగఁబెట్టి మెల్లనాయతివ జాఱె.

రేఁగుకొమ్మలు గాలికి నూఁగులాడి
చుఱుకు మని మేన ముండ్లు గ్రుచ్చుకొనుచుండ,
తన్ను పడుచుది గిల్లుచు నున్న దనుచు
వవ్వరే ! యని యాయవ్వ నవ్వుచుండె,

ఇట్లు నవ్వుచు నవ్వ రే యెల్లఁ గడపి
యందె పడియుండె వేకువ యైనఁ గాని;
చోద్య మందుచు జను లెల్ల చుట్టు మూఁగి
“ఏల నవ్వెద వవ్వరో ! ఇహిహి యంచు ?"‌

అనుచు ప్రశ్నింప, వానితో ననియె నవ్వ
"కాంక్షతో నాటకంబును గాంచుచుంటి,
ఆటలో రక్తి మీఱినయప్పు డెల్ల
నలువురును నవ్వ, నేనును నవ్వుచుంటి.”

18