పుట:మధుర గీతికలు.pdf/274

ఈ పుట ఆమోదించబడ్డది

రేఁగుచెట్టు భాగవతము


వినఁగ వీనులు, కానంగ కనులు లేని
మూఁడుకాళుల ముదుసలిముండ యొకతె
వీథినాటకమును జూడ వేడ్క జెంది
అడిగె తోడ్కొని పొమ్మని పడుచుదాని.

"అకట ! వినలేవు, కనఁజాల, వటకు వచ్చి
ఏమి యానంద మొందెద వీవు చెప్పమ!
ఎల్లరును నవ్వుచుండఁగ, తెల్లఁబోయి
నీవు చూడంగ, నవ్వరే నిన్ను జూచి ?"

అనుచు నాకాంత వచియింప, ననియె ముసలి
"ఆటలో రక్తి కట్టినయప్పు డెల్ల
గిల్లుచుండుము నామేను; గొల్లు మంచు
నలువురును నవ్వ, నేనును నవ్వుచుందు.”

17