పుట:మధుర గీతికలు.pdf/273

ఈ పుట ఆమోదించబడ్డది


అనుచు తన భర్త వచియింప, నతనిమాట
తెలియఁ జాలక వెండియుఁ బలికె భార్య,
"నాథ ! నీ వాక్యములు నాకు బోధపడవు,
స్మార్తుఁ డెవ్వని చలమునఁ జంపుచుండె ?”

“తెల్లముగ నీకు నటులై న తెలిపెద విను,
శివుని మొదటను, బ్రహ్మను చివరఁ బెట్టి,
నడుమ రాముని నిఱికించి నలిపి నలిపి
చంపుచున్నాఁడు మనదేవు స్మార్తుఁ డకట!

“స్మార్తు నెన్నటికైన నమ్మంగ నగునె?
అనుచు నే నెంత మొఱ పెట్టుకొనినఁ గాని
చెవిని బెట్టక యాతనిఁ జేరఁదీసి
ముప్పు దెచ్చితి వక్కటా! మూర్ఖురాల ?”

అనుచు వైష్ణవుఁ డెంతయు నలుక గదుర,
“ఎట్లు సహియింతు నీ పెండెకట్లవాని
చేష్ట ?" లని వానిపైఁ బడి చెవులు నులిమి
ఇంటిలోనుండి యవలికి గెంటివైచె.

16