పుట:మధుర గీతికలు.pdf/271

ఈ పుట ఆమోదించబడ్డది

వైదికుఁడు - వైష్ణవుఁడు


ఘోర మగు నొక్కజడివాన గురియుచుండ,
ఒకదినంబున రాత్రి వైదికుఁ డొకండు
వెష్ణవునియింటి కేతెంచి పండుకొనఁగ
స్థలము నిమ్మని ప్రార్థించె దైన్య మలర.

స్మార్తునకు తన గృహమున స్ధల మొసంగ
వలనుపడ దని వాదించె వైష్ణవుండు;
ఇంటి కేతెంచు నతిథిని గెంటివైచు
టనుచితం బని వారించె నతని గృహిణి.

మగఁడు పొమ్మన, రమ్మని మగువ పెనఁగ,
జరగె వాదము వారికి చాలసేపు;
భార్యపోరును పడలేక వైష్ణవుండు
పండుకొన తా వొసంగెను వై దికునకు.

14