పుట:మధుర గీతికలు.pdf/27

ఈ పుట ఆమోదించబడ్డది

16

లను బాల, బాలికలకు చల్లని వెలుగు బాటలుగా వెలయించుటయే కాక, తన కుమారుడు పాపాయి స్మృతిచిహ్నముగా 'పాపాయి' అను స్మృతికావ్యమును, 'ముద్దు' అను భావకవితా ఖండమును, తన జీవిత సర్వస్వమైన గ్రంథాలయములను గూర్చి 'గ్రంథాలయ' సూక్తులు, అను కావ్యమును, గాంధీదశావతారములు, 'వితంతు వివాహ చరిత్ర' 'స్త్రీలపై పురుషులు గావించు పంచమహాపాతకములు' అను వచన గ్రంథములను, తాను మిత్రులకు పద్య రూపముగా వ్రాసిన లేఖలను 'మిత్రలేఖావళి' యను పేరునను రచించి, ప్రచురించిరి. తనకు అన్ని రంగములలో ఆదర్శ గురుప్రాయుడైన శ్రీ పంతులుగారితో భేదభావము కల్గి, తరువాత తానట్లు గురు విమర్శ చేయుట ఒప్పగు పనికాదని భావించి 'అనుతాపము' అను నొక పొత్తమును పద్యయుక్తముగ వ్రాసి ప్రచురించిరి దీనితో వీరి రచనలు పదునేనుగా వీను మిగిలినవి. తన రచనములను అచ్చు వేయుటయే కాని, అమ్మకము చేసికొనుట చేతకాని వారగుట కొన్ని సేకరణ గ్రంథములను ముద్రణ గావింప లేకపోయిరి.

ఆంధ్ర వాఙ్మయ పోషకుడుగా, తొల్దొల్త ప్రాచీన ప్రబంధోదాహరణములతో పదివేల సామెతలను సేకరించియు, ముద్రణ చేయింపలేకపోవుటచే మిత్రుడైన శ్రీ చిలుకూరి నారాయణ రావుగారు తాను సంపాదించిన లక్ష తెనుగు సామెతలతోబాటు నీ సేక రణ భాగమును నీ పేరిట ప్రచురింప గలనని తీసుకొనుట జరిగినది. తర్వాత ఆ ముద్రణమును శ్రీ నారాయణరావుగారును గావింపలేకపోయిరి, కాలాంతరమున శ్రీ కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి