పుట:మధుర గీతికలు.pdf/269

ఈ పుట ఆమోదించబడ్డది


మువ్వురును మూడువై పుల ముట్టడించి
ఎట్టకేలకు దానిని బట్టుకొనిరి;
వింతగా దానితనుకాంతి వెల్లనయ్యె,
విన్ననై వారి మొగములు వల్ల నయ్యె.

ఱిచ్చవడి వార లంతట ముచ్చముడిగి
చిత్రములరీతి నిలిచిరి చేష్ట లుడిగి;
ఉట్టిపడినట్టు లింతలో నిట్టె వచ్చె
వారిచెంతకు నాల్గవ బాటసారి.

“ఏల యీలీల మొగముల వ్రేలవైచి
ఉస్సు రని వెచ్చనూర్చుచు నుంటి" రంచు
అడిగె నాతఁడు; వార లాగొడవ యెల్ల
పూసగ్రుచ్చినగతి వెలిబుచ్చి రంత.

పక్కు మని నవ్వి యాతండు పలికె నిట్లు:
“చిత్రముగ మీర లిప్పుడు చెప్పినట్టి
వింతజంతువు నూసరవెల్లి యందు,
రన్నివన్నియలును దానియందుఁ గలవు.

12