పుట:మధుర గీతికలు.pdf/268

ఈ పుట ఆమోదించబడ్డది


“దాని నిప్పుడ పొడఁగంటి దారిఁ జనుచు
కాదు నీలము, పచ్చయు, గాదు సుమ్ము;
వినుడు వచియించెదను - దానితనువుకాంతి
నిప్పుచందాన నెఱ్ఱనై యొప్పు మీఱు.”

"తగవరి నటంచు తా నొక్కదంట వోలె
ఔర ! పిలువని పేరంట మరుగుదెంచి
ప్రల్లదంబుల నేమేమొ పలుకసాఁగె,
విడిచిపుత్తుమె యూరక వీని నిపుడు ?"

అనుచు నిరువురు నా క్రొత్తయతని గదిసి
ఆగ్రహంబునఁ దలఁపడి; రంతలోనె
వృక్షముననుండి యూసరవెల్లి డిగ్గి
తటుకు మని వారియెదుట ప్రత్యక్ష మయ్యె.

దాని బొడఁగని వారలు తత్తరమున
'నేను గెల్చితి' 'నామాట నిజము చూడు'
'నాది పైచేయి' అనుచును వాదులాడి
దాడి వెడలిరి యొకపెట్ట దాని బట్ట.

11