పుట:మధుర గీతికలు.pdf/267

ఈ పుట ఆమోదించబడ్డది


"ఆగుమాగుము" - రెండవయాతఁ డఱచె-
“నీలమా దానితనుకాంతి ? మేలు మేలు !
ఇట్లు పలుకంగ నీకు నో రెట్టు లాడె?
చిలుకరీతిని పచ్చనై వెలయుచుండ.”

“పిచ్చియెత్తెను కాఁబోలు, పచ్చ ననుచు
వదరుచుంటివి నోరికివచ్చినట్లు"
“నీల మని యింక నొకసారి ప్రేలితేని
దౌడపం డ్లూడ గట్టిగా తన్నువాఁడ.”

అనుచు నిరువురు వాదంబు లాడి యాడి
కినుక రెట్టింప సిగపట్లకును బెనంగి
దొమ్ములాడిరి; అప్పు డా త్రోవఁ జనుచు
వచ్చె నచటికి మూడవ బాటసారి.

వారిఁ గనుఁగొని పలికె నా బాటసారి;
“చెల్లరే! మీర లీరితి సిగ్గు మాలి
కోడిపుంజులకైవడి కుమ్ములాడ,
ఎవ్వరైనను గన్నచో నవ్వ రొక్కొ?

10