పుట:మధుర గీతికలు.pdf/265

ఈ పుట ఆమోదించబడ్డది


“అడిగితిని మొక్క నీశుని, నాతఁ డిచ్చె,
వాన నెండయు మంచును వరుస నొసఁగు
మనుచు వరములు వేఁడితి, నాతఁ డన్ని
యిచ్చె; నది యేమిచిత్రమో - చచ్చె మొక్క.”

అనుచు వచియింప, రెండవముని వచించె
"లీల జగముల నెల్లఁ గల్పించినట్టి
సృష్టికర్తకె దాని నర్పించినాఁడ;
నారు వోసినయాతఁడే నీరు పోయు.

"ఇట్లు చేయము సర్వేశ ! అట్లు చేయు
మనుచు శాసించి వరముల నడుగలేదు;
అఖిలసృష్టినియామకుఁ డైనయతఁడు
లేఁత మొక్కను పోషింపలేఁడె చెపుమ.

“ఎప్పు డేరీతి నెవ్వని కేది హితమొ,
అప్పు డారీతి నవ్వాని కది యొనర్చు;
అఖిల బ్రహ్మాండనాయకుఁ డతనికంటె
అల్పమతి యగు మానవుం డధికుఁ డగునె !”