పుట:మధుర గీతికలు.pdf/264

ఈ పుట ఆమోదించబడ్డది


"చాలు చాలును పరమేశ ! తాళు మింక
పెల్లుజల్లున కోర్చునే పిల్లమొక్క ?
నెండపిసరుల దానిపై నిండఁ జేసి
సేదదేర్పవె అని వేఁడె సిద్ధవరుఁడు.

ఆతఁ డి ట్లనియెనొ లేదో - అంతలోనె
మొగులు లన్ని పటాపంచ లగుచు విచ్చె,
నింగి నంతట సూర్యుండు తొంగిచూచె,
మెండుగాఁ గాసె మిటమిట మండు టెండ.

“వేడియెండలచే మొక్క వాడె దేవ!
మంచు నించుక దానిపై నించు మయ్య”
అంచు ప్రార్థించె, తోడనే మంచు కరిసె;
ప్రొద్దు గ్రుంకెడిలో మొక్క మొగము వాల్చె.

తపసి యంతట వేఱొక్కతపసికడకు
నేగి, యచ్చట నేపుగా నెదిగియున్న
ఆముదపుచెట్టుఁ దిలకించి అక్కజపడి,
“చెప్పుమీ మొక్క నెట్లు పెంచితివొ సఖుఁడ !

7