పుట:మధుర గీతికలు.pdf/261

ఈ పుట ఆమోదించబడ్డది


చండకరుఁడయి తమమెల్లఁ జెండు నొకఁడు;
శీతకరుఁ డయి మనసు రంజించు నొకఁడు;
శత్రు మిత్రులు భాస్కర చంద్రులట్లు
వారు పరమోపకారులు కారె జగతి ?

తన్ను పగతురు నొంచిరి, తాను పగర
నొంచితి నటంచు కించిజ్ఞుఁ డెంచుచుండు;
అరయ దేహంబునకె కాని ఆత్మ కెందు
చెలిమికారంబు వైరంబు కలుగఁబోవు.