పుట:మధుర గీతికలు.pdf/26

ఈ పుట ఆమోదించబడ్డది

15

మభ్యంతరము చెప్పక, ప్రోత్సహించుట యందేమి, ఆమె మొదట్లో సనాతనాచార పద్ధతులలో తనకు సహకరింపక పోయినపుడామె నేమాత్రము తన అభిప్రాయానుసారము ప్రవర్తింపవలెనని నిర్బంధింపక పోవుటయే కాక, ఆమె కాలము గడచిన కొలదీ తన ఉద్యమముల యందలి ఔన్నత్యమును, దేశహితమును గ్రహించి, తనతోబాటు అన్ని ఉద్యమములలో పాల్గొని తనకు సహకరించి నపుడెంతో సంతోషించుటయే కాక, ఆమె ఆంధ్రమహిళా గానసభను స్థాపించి నిర్వహించినపుడామెకు అన్ని విధముల ఆజన్మాంతము ప్రోత్సాహ సహాయ సహకారము లొసంగుట యందేమి శ్రీకృష్ణరావుగారు 'మహిళాభ్యుదయమే మానవాభ్యుదయము' అను నగ్నసత్యమనెంతగా నమ్మి, తదాచరణలో ఎంత నిష్కల్మషమైన తీవ్రతను జూపి, ఆ ఉద్యమమును ప్రోదిచేసి యుండిరో, మనకు తెల్లము కాగలదు.

ఈ విధముగా కృష్ణరావుగారు ఆనాటి సాంఘిక రాజకీయ రంగములన్నింటిలో, ఆనాటి భారతీయ పౌరుడుగా తన విధ్యుక్త ధర్మమనియు, తనక నీసబాధ్యతాయుతకర్తవ్యమనియు భావించి పాల్గొని దేశమాతను సేవించుటయే కాక, చక్కని కళాభిజ్ఞతతో సమలంకృతమైన హృదయ చైతన్యముతో భావిపౌరులు కావలసిన బాలుర అపరిపక్వ మనస్సంస్కారములను భారతీయ సంస్కృతి కనుగుణముగా రూపులు తీర్చవలెనను ఉత్తమాశయతో మధురగీతికలను ప్రధానమకుటమున "గోరుముద్దలు, మీగడతఱకలు, తేనెచినుకులు, వెన్నెల వెలుగులు, వెన్నబుడగలు, విరిదండ, దీపావళి, పాలతరగలు అను కావ్య సంపుటము