పుట:మధుర గీతికలు.pdf/258

ఈ పుట ఆమోదించబడ్డది

సూర్యోదయము


చిమ్మచీఁకటిసోకులఁ జెండియాడ
ప్రాచ్యభూధర మనెడి పిరంగినుండి
కాలపురుషుండు వెడలించు గోళ మనఁగ
అరుణరుచితోడ తరుణభాస్కరుఁడు వెలిఁగె.

పండుటాకులు సంజలు, వక్క లిరులు,
లేఁతయీరెండ సున్నంబు రీతిఁ జెలఁగ,
తమ్ములము వైచు ప్రాగ్దిశాతరుణియధర
బింబమో యన మార్తాండబింబ మలరె.

సప్తవర్ణముల్‌ తనయందు సంతరించి
కరము లను తూలికలచే జగంబు లెల్ల
వింతవన్నెల రచియించె వేడ్క మెఱయ
చిత్రభానుని పేరిటి చిత్రకరుఁడు.