పుట:మధుర గీతికలు.pdf/252

ఈ పుట ఆమోదించబడ్డది


అనుడు, నా మాట లాలించి యాగ్రహమున
కనుల నిప్పులు రాలంగ మునిని గాంచి
“తోడనే నాదు రాజ్యంబు వీడి యవల
తొలఁగిపొ"మ్మని యదలించి పలికె ఱేఁడు.

“దేవునే గెంటివై చిన దిట్ట వీవు
ఇంక నను గెంటివైచుట యేమి లెక్క?
ఇంతకాలముదనుక నీచెంత నుండి
వెడఁగునై తిని” అని పల్కి వెడలె. మౌని.