పుట:మధుర గీతికలు.pdf/250

ఈ పుట ఆమోదించబడ్డది

యతి - నృపతి


విభునితో భృత్యుఁ డీరితి విన్నవించె:
“యతివరేణ్యుఁడు దేవాలయమ్ము వీడి
గుడికి వెలుపల గుడిసెల నడుమఁ జేర
చెట్లనీడను ప్రార్థన చేయుచుండె.

తమ్మిపువ్వునఁ దూఁగాడు తుమ్మెద లన
వానిచుట్టును మూఁగుచు భక్తు లకట!
ఒక్కడును లోని కడుగిడ నొల్లఁ డయ్యె;
శోభ చెడి దేవళం బెల్ల ళూన్య మయ్యె.”

సంభ్రమంబును చిడుముడి సందడింప,
యతివరునిచెంత కేతెంచి, యనియె నృపతి;
“స్వర్ణగోపుర మున్న దేవళము వేడి
చెట్లనీడను పార్థింపఁ జెల్లు నయ్య?"