పుట:మధుర గీతికలు.pdf/25

ఈ పుట ఆమోదించబడ్డది

14

గ్రంథాలయము నుండి, ఆ రోజులలో, ఇల్లువీడి ఇవతలకు స్త్రీలు వచ్చు టే తప్పుగా భావింపబడెడు ఆనాటి సంఘ వ్యవస్థలో, అనేకమైన ఉత్తమ గ్రంథములను ఇండ్లకు స్త్రీలకు పంపి, ప్రతి మాసమునందును, వారికి వారు చదివిన గ్రంథములలో పరీక్షలు పెట్టి, వారికి బహుమతులంద జేయుటయే కాక, వారిచే వ్యాసములు వ్రాయించుట మున్నగు నెన్నో మహిళాజకోద్ధరణ కార్యక్రమములను చేపట్టిరి.

తన పెదతండ్రి కుమారులైన కాకినాడ వాస్తవ్యులు శ్రీ నాళము రామలింగయ్యగారు వైశ్యసేవా సదన మహా సంస్థను స్థాపించుటలో, తానును, తన మిత్రుడు కోరుకొండ లింగమూర్తిగారును మిక్కిలి సహాయమొనర్చుటయే కాక, ఆ వైశ్య సేవా సదన స్థాపనకు ముఖ్యకారకురాలైన సంఘ సేవాధురీణ శ్రీమతి బత్తుల కామాక్షమ్మగారి కాజీవితాంతము ఎనలేని సాయమొనర్చి యుండిరి - బావగారు పెట్టిన గౌతమీ గ్రంథాలయం వలన విద్యను నేర్చి, అభ్యుదయ భావాలను ప్రోదిచేసుకొని, వారి అమూల్య సహాయంతో నేను సదనాన్ని స్థాపించి, నిర్వహించాను - రావు అని ఎన్ని పర్యాయములో చేసిన ప్రస్తావననుబట్టి శ్రీకృష్ణ వ క్తఆమె మహిళాభ్యుదయము పట్లకల ప్రగాఢమైన వాంచ అభిమ్యు గారికికాగలదు.

తన భార్యయైన శ్రీమతి సుశీలమ్మగారికి కవిత్వాభ్యాసము పట్ల తీవ్రాసక్తి కల్గించుటలోనేమి, గాంధీమహాత్ముని ఆదేశానుసారమాయె సత్యాగ్రహోద్యమమున పనిచేయుటకు ఏ మాత్ర