పుట:మధుర గీతికలు.pdf/249

ఈ పుట ఆమోదించబడ్డది


చూడుమా యిదె రెండవ వాడితూపు .
దాఁచియుంచితి నా చల్లడంబునందు;
నీదు ప్రాణము కాపాడి నిన్ను విడిచి
పుచ్చినందుకు నను నీవె మెచ్చవలయు.

ఎల్లజగములఁ గాపాడు నీశ్వరుండు
నన్ను నిన్నును కాపాడినాఁడు నేఁడు;
వాని కర్పించుకొందము భక్తి మీఱ
వర కృతజ్ఞతాపూర్వక వందనములు.