పుట:మధుర గీతికలు.pdf/248

ఈ పుట ఆమోదించబడ్డది


సూటి నేగిన యా తూపునేటు తగిలి
రెండు చెక్కలుగాఁ జీలి రేఁగుకాయ
ధరణిపైఁ బడె చూపరుల్‌ వెఱఁగుపడఁగ,
బాలుఁ డలరారె తలపువ్వు వాడకుండ.

బళిర! మెచ్చితి నీవు నీ బాలకుఁడును
నేఁడు చూపిన తెగువకు! వేడు కలర
నీదు నెలవున కేగుమీ, నిన్ను విడిచి
పుచ్చితిని గాన, నను నీవు మెచ్చవలయు.'

అనుచు నృపుఁ డన, చల్లగా ననియె కాఁపు
“నిన్ను నే మెచ్చు టటు లుండ, నన్నె నీవు
మెచ్చుకొనవలె, నిను బొరిపుచ్చకుండ
ప్రాణదానంబు జేసితిఁ గాన ఱేఁడ!

ఓయి! నీ చావు నాచేత నుండె సుమ్మి;
నాదు బాణము గుఱి తప్పి నా కొమరుని
శిరము తెగెనేని, తెగును నీ శిరము కూడ
వాడి యగు నాదు రెండవ బాణమునను.