పుట:మధుర గీతికలు.pdf/241

ఈ పుట ఆమోదించబడ్డది

విలియం టెల్


వినుఁడు జనులార! వినిసింతు వింతకతను
జరిగినదె కాని, కల్పితచరిత కాదు:
దివ్య మైన స్విజ్జర్లాండు దేశమందు
కలఁడు 'విలియము టె' ల్లను కాఁపువాఁడు:

ఏటియొడ్డున నొక చిన్న తాటియాకు
గుడిసెలో కాఁపురము చేసి, గొఱ్ఱెమంద
తోలుకొని వాఁడు మడిమట్ర దున్నుకొనుచు,
కష్టపడి జీవయాత్రను గడపుచుండు.

పొడమె నతనికి చిన్నారి బుడుతఁ డొకఁడు;
వాని పలుకులు తేనియసోన లొలుకు,
తేటకన్నులు ముద్దుల మూట గట్టు
లేఁతనవ్వులు వెన్నెలపూంఁత వెట్టు.