పుట:మధుర గీతికలు.pdf/240

ఈ పుట ఆమోదించబడ్డది


         కన్నులారఁగఁ దన కూర్మి కన్నసుతుని
         గాంచు ముచ్చట యింతలోఁ గలుగు నొక్కొ
         పనికిమాలిన పరమనిర్భాగ్యురాలి?
         కకట? నిక్కంబుగాఁ దెల్పు మయ్య నాకు.

జోదు: తల్లిరో! ఇంక నీకక్ష దాఁచ నేల?
        నీదు కూరిమితనయుండు మాధవుండు
        అప్పుడే వచ్చి చాలసే పయ్కె నమ్మ!
        ఇంత తడవును వాఁడు నీచెంత నుండె,
        ఈవు పోల్చంగ లేకుంటి వింతె కాని.

మాత: యోధుఁడా! నీవు నా ముద్దు మాధవుఁడవె?

జోదు: మాతరో! నేను నీ ముద్దు మాధవుఁడనె.