పుట:మధుర గీతికలు.pdf/24

ఈ పుట ఆమోదించబడ్డది

13

ఆ ఉద్యమమున కంకితము చేసుకొన్న అకలంక దేశభక్తుడు శ్రీకృష్ణరావుగారు! ఆంధ్రదేశమునందలి సుప్రసిద్ధమైన జెండా కేసునకు పట్టుగొమ్మలు శ్రీ దేవత శ్రీరామమూర్తిగారు. శ్రీ నాళము కృష్ణరావుగారు మాత్రమే అని చెప్పవలసి యున్నది.

రాజమహేంద్రవరమున టౌనుకాంగ్రెసుకు సెక్రటరీగా నున్న సమయమున పూజ్య బాపూజీ విదేశ వస్త్రదహనమునకు పిలుపు నిచ్చినపుడు తన భార్య సుశీలమ్మ తన యింటిముందు వీధిలో బాపూజీ ఎదుట తన విదేశ వస్త్రములన్నింటిని రాసులుగా పోసి దహనమొనర్చినపుడామెకు ప్రోత్సాహమిచ్చి తోడ్పడిరి.

గాంధీమహాత్ముడు నడపిన సత్యాగ్రహోద్యమములో చరిత్ర ప్రసిద్ధి పొందిన పెద్దాపురం లాటీఛార్జి సంఘటనలో, ప్రప్రధమము నుండి తనకు నీడగా ప్రవర్తించిన క్రొత్త సూర్య నారాయణగారితో బాటు లాఠీ దెబ్బలు తిని చాలా బాధపడిన సత్యాగ్రహిశ్రీ నాళము కృష్ణరావుగారు.

కాంగ్రెసు ఉద్యమమున అతివాద పక్షమునవలంభించి తాను కార్యదర్శిగా ఉన్న శ్రీపంతులుగారి టౌను హాలులో ఖుదీరాం బోసు చిత్రపటమును బెట్టి, మితవాదియైన శ్రీ పంతులుగారికా చర్య ఇష్టము లేకుండుటచే వారమురోజులు నిద్రాహారములు లేకుండా ఆ పటమునకు కాపలా కాచిన ధీరయువరత్నము; శ్రీ కృష్ణరావుగారు !

ఇంక ఆమాననీయుడు సల్పిన మహిళా జనోద్ధరణ సేవయు ప్రస్తుతిపాత్రమైనదే. తాను స్థాపించిన గౌతమీ