పుట:మధుర గీతికలు.pdf/239

ఈ పుట ఆమోదించబడ్డది


మాత: చాలు చాలును, నిలు మింక తాళు మయ్య!
         ఇంక వినఁ జూలఁ తక్కిన దెప్పు డైన
         చెప్పెదవు కాని ముందుగా నిప్పు డొకటి
         అడుగుచుంటిని, తప్పక నుడువు మయ్య!
         కన్న తనయునిఁ గని చిరకాల మయ్యె
         ఇప్పు డేరీతి నున్నాఁడొ యెఱుఁగఁజాల
         నయ్య! వర్ణించి చెప్పుమా యతని రూప
         మెట్టు లుండెనొ, కన్నులఁ గట్టినట్లు.

జోదు : మాతరో! వానిరూపంబు మాఱిపోయె.
          వ్రేలుగడ్డము మీసము పెంచి నేఁడు
          పెద్దవాఁ డయ్యె: వాఁడు నీయొద్ద కిపుడు
          వచ్చి నిలిచిన పోల్ప నీ వశము కాదు:
          ఇంత యేటికి? నీ సుతుఁ డిటకు వచ్చు
          తరుణ మయ్యెను, కన్నులకఱువు దీఱ
          గాంచు భాగ్యము నీ కిదే కలుగు నమ్మ!
          ఏల నీ కింక తత్తర మింతలోనె!

మాత: వచ్చుచున్నాఁడ? చెప్పుమా నిశ్చయముగ;
         ఎపుడు వచ్చును? ఏమంటి? విపుడె యనియ?