పుట:మధుర గీతికలు.pdf/237

ఈ పుట ఆమోదించబడ్డది


            వచ్చుచున్నాఁడు తలపువ్వు వాడకుండ
           నీదు చరణరాజీవసన్నిధికి వేగ.

మాత : చల్లఁగా వేయియేండ్లు వర్దిల్లు మయ్య!
          ఆ ర్తరక్షక! ఈ శుభవార్త వినఁగ
          నిలిపితివె జీవనంబుల నేఁటిదాఁక?
          వీరుఁడా! నీదు పల్కులు వినకయుండ,
          నడుమ నడ్డంబు వచ్చితి - నుడువు మయ్య
          తనదు ముదుసలి తల్లికి అను గు బిడ్డ
          ఏమి సందేశ మంపెనో ప్రేమ మీఱ,
          విందు చెప్పుమ వీనులవిందు గాఁగ,

జోదు : పగతురకుఁ జిక్కి మనరాజు పట్టువడఁగ,
         సైన్యములు పటాపంచలై దైన్యవృత్తి
         పరుగువాఱుచునుండ, నీ వరసుతుండు
         మెఱపు మెఱసినచందాన నురవడించి,
         "పాఱిపోయెద రేటికో పందలార!
         దోర్బలంబున రిపులతో దుర మొనర్చి
         చంపు టొండెను, వారిచేఁ జచ్చుటొండె

56