పుట:మధుర గీతికలు.pdf/236

ఈ పుట ఆమోదించబడ్డది


మాత : ఏమి యంటివి? చెప్పుమా - ఏమి యంటి?
          నాదు నందనుడే ! - నాదు నందనుండె!-
          నాదు చిన్నారి పొన్నారి నందనుండె!-
          నాకు సందేశ మంపెనా? నాకె - నాకె!

          ఏమి యంపెను? సందేశ మేమి యంపె?
          ఆతఁ డాడినయట్టి ప్రత్యక్షరమును
          కడమ యొక్కింత వడకుండ నుడువు మయ్య?
          యోధుఁడా! నీవు నమ్మెదో లేదొ కాని-
          అతఁడే నాదు జీవన మతఁడె ప్రాణ,
          మాతఁడే నాదు చేయూత, అతఁడె ప్రాపు;
          చెప్పు మేటికి తడసెదు; చెప్పు మయ్య!
          పిదప సంగతు లన్ని చెప్పుదువు కాని-
          ముందుగాఁ జెప్పు మొకమాట, నందనుండు
          చెక్కుచెదరక యున్నాఁడె సేమముగను?

జోదు : పెక్కుమాట లిఁకేల? నే నొక్కమాట
         చెప్పుచుంటిని విన వమ్మ శీఘ్రముగను !
         జననిరో! నీదుతనయుండు సమరమందు
         శత్రు బలముల నెల్లను జక్కడంచి

55