పుట:మధుర గీతికలు.pdf/235

ఈ పుట ఆమోదించబడ్డది

యోధుఁడా !


మాత : యోధుఁడా ! చెప్పు మెందుండి నీదురాక?
          ఎన్నఁడో నిన్ను దిలకించియున్నయట్లు
          జ్ఞప్తి యున్నది, వచియింపఁ జూల నెట్లొ-
          చోడు లందరు - అందఱజోలి యేల?-
          నాదు కూరిమితనయుండు మాధవుండు
          సేమముగ నున్నవాఁ డేమొ చెప్పుమయ్య!
          దిక్కుమాలినయట్టి యీ దీనురాలి
          దీవనలు నిన్ను సాఁకును తెలుపు మయ్య!

జోదు : జననిరో! నీదు మేలి దీవనలచేత
         సుఖముగా నున్నవారలు చోడు లెల్ల;
         నీదు కూరిమి తనయుండు మాధవుండు
         నీకుఁ బంపినయట్టి నందేశ మిదిగొ
         తెలుపుచుంటిని, ఆశీర్వదింపు మమ్మ,

54