పుట:మధుర గీతికలు.pdf/233

ఈ పుట ఆమోదించబడ్డది


దారుణోజ్వలకిరణుండు తపనుఁ డేడ,
ఉల్లిపొరవంటి నెమ్మేన నల్లలాడు
నట్టి నీ వేడ? అక్కటా ? ముట్టినంత
బగ్గు మని కాలి కూలవె బుగ్గి యగుచు?

సూత్ర మొక్కటి మెడయందు సూటిపడిన
యంతమాత్రాన ద్విజరాజు నైతి నంచు
చెంగుచెంగున గుప్పించి నింగి కెగసి
చంద్రుఁ జెనకెద వెంతటి సాహసంబొ?

విల్లు నాచెంతఁ గల దని విఱ్ఱవీఁగి
రాజు లెవ్వరు నా కీడు రా రటంచు
నాక మెగ సెదు రాజుతో డీకొనంగ
కొండతోడ పొటేలు డీకొన్నయట్లు.

చీకుగుడ్డలు, చింపిరికాకితములు,
పుడకలును గల్గి, అతుకులబొంత యైన
గాలిపటమవు నీ వేడ, కాంచి చూడ
సహజలావణ్యరాశి యౌ చంద్రుఁ డేడ?

52