పుట:మధుర గీతికలు.pdf/232

ఈ పుట ఆమోదించబడ్డది

గాలి పడగ


పడగ, తోఁకయు, నొక్కింత వాయుబలము
నమరినంతన, పెనుబాము నై తి నంచు
ఇనుని మ్రింగఁగ నింగిపై కెగసె దౌర!
కాలి కూలవె మసి యౌచు గాలిపడగ?

గగనమున పక్షికై వడి నెగిరెద వని
ధారుణీస్థలి నిన్ను పతంగ మనుచు
పిలిచినంత, పతంగుని పిలుకుమార్ప
మింటి కెగసెద, వెంతటి మిడిసిపొటొ?

పెంటఁ బొరలాడు గోచుల నంటఁగట్టి
తోఁక యొక్కటి తగిలింప, త్రుళ్లిపడుచు
అల్ల హనుమంతుతో సాటి నై తి ననుచు
గంతు లిడియెదవే భానుమంతు మ్రింగ.

51