పుట:మధుర గీతికలు.pdf/231

ఈ పుట ఆమోదించబడ్డది


తనదు మిత్రుండు నీటిలో మునిఁగి యెంత
తడవునకు తేలకుంటకు తల్లడిల్లి,
'కటకటా! ఎంత గజయీఁతకాఁడు చచ్చెఁ
గదర!' యని బిట్టు దురపిల్లె కవివరుండు.

కొంతకాలము జరిగినయంత, నతఁడు
తనదు మిత్రుని సద్గుణగణము గూర్చి,
ఈఁతలో వాని మహితవిఖ్యాతి గూర్చి
రమ్యముగ వ్రాసె స్మారకగ్రంథ మొకటి.

సరస మగు వాని కవనచాతురికి మెచ్చి
భాగ్యవంతుని తనయుండు ప్రమద మంది
'సరసకవితాధురీణ' యన్‌ బిరుద మొసఁగి
కవివరేణ్యుని మిక్కిలి గారవించె.

50