పుట:మధుర గీతికలు.pdf/230

ఈ పుట ఆమోదించబడ్డది


సంభ్రమంబున ధనికుండు సలుపుచున్న
చేఁతలను నీఁతలోని విశేషములుగ
చిత్తమున నెంచి కవికులసత్తముండు
'బళిబళీ! నీదు 'కూ' ర్పని ప్రస్తుతించె.

సొక్కి సోలుచు నుక్కిరిబిక్కి రగుచు
సారె కాతఁడు కడుపుబ్బ నీరు ద్రావి
నాలుక వెలార్చి కన్నుల దేలవైచి
మునిఁగి తేలుచు కొట్టుకపోవుచుండె.

నీట దేలుట యీఁతలో నిపుణు లైన
జనులు గావించు నొక విశేషంబె గాన,
సొంపుగా వాని నేర్పు వర్ణింపఁ గోరి
'బళిర! నీదు తీ' ర్పని కవి ప్రస్తుతించె.

ధనికుఁ డంత బుడుంగున మునుక వైచి
తేలకుండెను నీటిపై చాల సేపు;
అది జల స్తంభవిద్యగా మదిఁ దలంచి
'అవుర! ఏమి నీ యో' ర్పని కవి నుతించె.

49