పుట:మధుర గీతికలు.pdf/23

ఈ పుట ఆమోదించబడ్డది

12

కరించి, వచ్చిన బాల వితంతువులను రాజమహేంద్రవరము చేర్చి, తనయింట వారికి అన్ని వసతులను ఏర్పాటుచేసి శ్రీపంతులు గారికి అప్పగించుటయే కాక, ఆ పెండ్లిండ్లు సక్రమముగా జరుగునంత వఱకు శ్రీపంతులుగారి కన్ని విధముల చేదోడు వాదోడుగా నుండి, వారేర్పఱచిన 'రామదళ నాయకత్వమును సార్ధకముగ సమర్ధవంతముగా నిర్వహించుచు సంఘసంస్కారోద్యమమున నింతింతరాని సేవ సల్పిరి.


అంతతో ఊరుకొనక వితంతూద్వాహసంస్థలను ఏలూరు మున్నగు నగరములలో ప్రతిష్ఠాపించి ఆ ఉద్యమ వ్యాప్తికి తోడ్పడిరి.


వీరేశలింగముపంతులుగారు చేబూనిన మఱొక మహోద్యమము, బ్రహ్మ సమాజ మత సంస్కారము - ఆ ఉద్యమము నందును కృష్ణరావుగారే అగ్రసరుడని చెప్పవలసి యున్నది. ఆయుద్యమ నిర్వహణమున శ్రీపంతులుగారి కంటె ముందే జందెము తీసివేసి, వారికంటె ముందుగా సర్వమత సమ్మేళన విందును తన యింటియందు జరిపి, బంధువుల ఆగ్రహమునకు గురియై, వెలివేయబడి తుద క్తతవారైన ఏలూరు నందలి మోతే వారు కూడా తనను ఇంట్లోకి రానీయక పోవుటచే, ఏలూరులో, తన ఆప్తమిత్రుడైన శ్రీ మాజేటి సుబ్బయ్యగారింట భుజించిన ధీరయువరత్న మాయన !


అట్లే గాంధీమహాత్ముని స్వాతంత్ర్యోద్యమ శంఖారావము వీనుల సోకిన యంతనే ఆ ఉద్యమమునందురికి తనను తాను