పుట:మధుర గీతికలు.pdf/228

ఈ పుట ఆమోదించబడ్డది

కవి - ధనికుఁడు


కలఁ డొకానొక పురమున కవివరుండు;
ఆతఁ డొక భాగ్యవంతుని నాశ్రయించి
చీటిమాటికి నాతండు చేయునట్టి
పనుల నెల్ల 'బళాబళీ' యనుచు పొగడు.

కులటలను జేరి ధనికుండు కూడిమాడ,
భోగి యని వాని కవిరాజు పొగడుచుండు;
దుండగీండ్రకు విత్తమాతం డొసంగ,
త్యాగి యని కవి వాని సంస్తవ మొనర్చు.

పెల్లుగాఁ ద్రావి ధనికుండు ప్రేలెనేని,
జ్ఞాని యని వాని కొండాడు కవివరుండు;
కై పుచే వాఁడు మత్తెక్కి కనులు మూయ,
ధ్యాని యని కవి వాని సంస్తవ మొనర్చు.

47