పుట:మధుర గీతికలు.pdf/226

ఈ పుట ఆమోదించబడ్డది


అనుచు వారు ప్రసంగించుకొనుచునుండ,
పొదలమాటున తో డేలు పొంచియుండి,
గఱిక మేయుచు నచ్చట తిరుగుచున్న
గొఱ్ఱెపైఁ బడి గొబ్బున గొంతు నులిమె.

పిల్లి నివ్వెరపడె, నక్క తెల్లవోయె;
'ఇట్టి ఘాతుక మృగము నే నెందుఁ జూడ'
ననుచు వచియించె మార్జాల; 'మకట? యిట్టి
హత్య కనులారఁ జూడలే' ననియె నక్క .

'జీవి జీవిని బట్టి భక్షించుకంటె
ఆకలంబులఁ దినరాదె?' అనియె పిల్లి;
'మాంసభక్షణమును జేసి మనుటకంటె
అసువు దొరఁగుట మేల్గాదె?' అనియె నక్క,

అట్లు శ్రీరంగనీతుల నాడుకొనుచు
అ బిడాల సృగాలము లరుగుచుండ,
కొంతదవ్వున నొక పూరిగుడిసెపొంత
గింజ లేరుక తినుచుండె పుం జొకండు.

45