పుట:మధుర గీతికలు.pdf/225

ఈ పుట ఆమోదించబడ్డది

జీవహింస


పురము వెలుపల నొక సరోవరముపొంత
వాస మొనరించె మార్జాలవల్లభుండు;
ఒక్కదినమున నచటికి నక్క యొకటి
దారివెంబడి తిరుగుచు తారసిల్లె.

'స్వాగతము నీకు జంబుకస్వామి!' యనఁగ,
'సేమమే నీకు మార్జాలశ్రేష్ట?' యనుచు
కుశలప్రశ్నంబు గావించుకొనుచు, వారు
సరససల్లాప మాడిరి చాలసేపు,

'ధారుణి నహింసకంటె సద్ధర్మ మొండు
కలుగఁబో ' దని వాదించి పలికె పిల్లి;
'భూతదయకంటె మించిన పుణ్యకార్య
మవని లే' దని గొంతెత్తి యఱచె నక్క.

44