పుట:మధుర గీతికలు.pdf/223

ఈ పుట ఆమోదించబడ్డది


తూన్క తూచితి, సరియైన తూన్క. తూగె;
గీటు పెట్టితి, మేలిమిగీటు వచ్చె;
నాణె మరసితి‌, చక్కనినాణె మమరె;
సంతసించితి పని‌ జిగినంతనకును.

కొంతకాలము గడచినయంత, నపుడు
పెద్దకోమటియింటను పెండ్లి యొకటి
జరుగ, సంభావనంబున కరిగియుంటి;
త్రోపులాడిరి దొడ్డిలో బాపనయలు.

చెవులు పట్టుక నను లాగె సెట్టికొడుకు
లేమ! ఆతని పోతర మేమి చెప్ప-
వెంటనే కుండలంబులు పెళుకు మనుచు
లొట్టవడి యీవలికి వచ్చె లోనిలక్క,

చెవులు చేతులఁ దడవుచు నివలఁ బడితి
మనమునం దిట్లు తలపోసికొనుచు నంత:
'మాయురే! బత్తుఁ డెంతటి మాయ చేసె
మంచిమాటల నన్ను నమ్మంగఁ బలికి?"

42