పుట:మధుర గీతికలు.pdf/222

ఈ పుట ఆమోదించబడ్డది


అంత నీరీతి భర్తతో ననియె భార్య:
“వాద మేటికి?" అది లక్క గేదె యనుచు
మీరు దృఢముగ మదిని నమ్మితిర యేని
ఋజువు చేయుఁడు హేతు వేదేని చెప్పి"

“అట్టు లైన వచించెద నతిప! వినుము,
మున్ను నే నీ పురంబున నున్నయపుడు
కుండలంబులఁ జేయించుకొనఁ దలంచి
మూఁడు బంగారుకాసులఁ గూడఁబెట్టి.

ఎదుట నున్నట్టి బత్తునియింటి కేగి,
'కంసలీ! నీదు నే ర్పెల్లఁ గానిపింప
గట్టి కుండలముల జత కట్టవలయ'
అనుచుఁ బలికితి, నీరీతి ననియె నతఁడు:

'ఇరుగుపొరుగున నుంటిమి యిన్నినాళ్లు
లాఁతివాఁడనె పలుక నీరీతి?' ననుచు
మంచిమాటల నన్ను నమ్మంగఁ బలికి
శీఘ్రముగ కుండలంబులు చేసి యిచ్చె.

41