పుట:మధుర గీతికలు.pdf/221

ఈ పుట ఆమోదించబడ్డది


అనుచు నాతఁడు వచియింప, ననియె నింత;
“నీదు వచనంబు చోద్యంబు గాదె నాథ!
లక్క గేదెలు కలుగునే యెక్కడైన?
ఎవ్వ రేనియు విన్నచో నవ్వ రొక్కొ?"

“ఎవ్వ రెన్నివిధంబుల నవ్వ నిమ్ము;
నిక్క మగు గేదె కా దది లక్క గేదె
అంచు ముమ్మాటికిని వచియించుచుంటి
అనుచు గట్టిగ సతితోడ ననియె నతఁడు.

'గడ్డి మేయుచునున్నది' 'గడ్డి మేయు'
'పాల నిచ్చుచు నున్నది' 'పాల నిచ్చు'
'పేఁడ వేయుచునున్నదీ 'పేఁడ‌ వేయు'
'దూడ లీనుచున్నది' 'దూడ లీను.'

ఆలుమగలకు నీరీతి చాలసేపు
జరగె వాదము; సతిమాట సరకుగొనక
తాను పట్టిన మాటయే తథ్య మనుచు
పెనుఁగులాడె 'ససేమిరా' యనుచు భర్త.

40