పుట:మధుర గీతికలు.pdf/22

ఈ పుట ఆమోదించబడ్డది

11

పొంది, తర్వాత గౌతమీ గ్రంథాలయముగా శాశ్వతరూపము దాల్చినది.

గౌతమీ గ్రంథాలయాభివృద్ధికి, స్థిరత్వమునకు కృష్ణరావుగారు ఎంతగా శ్రమించినారో, ఎన్ని వేల రూప్యముల ద్రవ్యమును తన ఆస్తి నుండి ఖర్చు పెట్టి త్యాగము చేసి యుండిరో అనునది ఊహకందనిది !

ఎక్కడా దొఱకని తాళపత్ర గ్రంథముల నెన్నింటినో సంపాదించి యుండిరి - ఋగ్వేదమునకు పద్యరూపమున అనువాదమును సంపాదించి భద్రపఱచిరి - దానినే ఈ నాడు తిరుమల, తిరుపతి దేవస్థానము వారు ముద్రించి వెలుగులోనికి దెచ్చిరని ఈ శుభతరుణమున చెప్పుటకు సంతసించుచున్నాను.


గ్రంథాలయ ప్రతిష్ఠావనము, దాని నిర్వహణకార్యమును ఒక వంక సాగుచుండ, వేరొకవంక వితంతూ ద్వాహ సంస్కారమునకై పలువిధముల పాటుపడుచున్న శ్రీ కందుకూరి వీరేశలింగంపంతులుగారి ఆనుచరవర్గమున జేరి, అందు అగ్రశ్రేణి కార్యకర్తగా శ్రీ పంతులుగారిచే ఎంచబడి, రహదారులే లేని ఆ కాలమున అంచెల బండ్లపై ఇచ్ఛాపురము వంటి అతిదూర ప్రదేశములకేగి, పావురాయి, మైనాపిట్టల టపా సహాయముతో పునర్వివాహము చేసుకోదలచిన బాల వితంతువులకు తమ వితంతూ ద్వాహ సంస్థా సందేశములనందజేసి, పరమవిశ్వాసముతో తన వెంబడి రాజమండ్రి వచ్చి పునర్వివాహము చేసుకొనుటకంగీ