పుట:మధుర గీతికలు.pdf/219

ఈ పుట ఆమోదించబడ్డది

లక్క గేదె


విప్రుఁ డొక్కఁడు లేమిచే వెతలఁబడుచు
తన కుటుంబము పోషించుకొనఁగ లేక
ధనము నార్జింప మానసంబునఁ దలంచి
జలనిధిని దాఁటి దూరదేశముల కేగె.

కొంతకాలము గడచినయంత, నతఁడు
ధనము గడియించి తనపురంబునకు వచ్చె;
పౌరు లెల్లరు నత్యంత గౌరవమున
వానిఁ దోడ్కొని వచ్చిరి స్వగృహమునకు.

భర్త రాకకు ముదమంది వానిభార్య
కమ్మనెయ్యియు, కూరలు, గట్టిపెరుఁగు,
పిండివంటలు వడ్డించి ప్రీతితోడ
తనివి దీఱఁగ పతికి భోజనము వెట్టె.

38