పుట:మధుర గీతికలు.pdf/217

ఈ పుట ఆమోదించబడ్డది


అంత మేఁకపిల్ల నతనిచెంగట నిల్పి
జలము త్రావ గొల్ల కొలనియందుఁ
జొచ్చి, మగుడ వచ్చి చూచెడినంతలో
పరుగువెట్టె నెటకొ మఱకపిల్ల.

"ఏది మేఁకపిల్ల? ఎందు దాఁచితి” వంచు
గొల్లఁ డడుగ, ననియె పల్లెవాఁడు
“మఱకకాలు నేను విఱుగఁగొట్టితి నంచు
పల్క నెట్లు నీకు నాల్క వచ్చె?'

ఒకరు చెప్పు మాట లొకరికిఁ దెలియక
తిట్టుకొనుచు వారు తుట్టతుదకు
కొట్టులాటకు దిగ, కొంతసేపటి కంత
వారి కెదురువడియె పాఱుఁ డొకఁడు.

ఆలిమీఁద నాతఁ డలిగి జందెము ద్రెంచి
యిల్లు విడిచి యెటకొ యేగుచుండె;
అతనిచెంతఁ జేర నరిగి యా యిరువురు
పోరు దీర్ప వానిఁ గోరికొనిరి.

36