పుట:మధుర గీతికలు.pdf/216

ఈ పుట ఆమోదించబడ్డది

చెవిటి భాగవతము


కుంటిమేఁకపిల్ల వెంటఁ గొలపోవుచు
చెవిటిగొల్లఁ డొకఁడు చెఱువుగట్టు
కడకు నేగి, యచట గట్టుపైఁ గూర్పున్న
పల్లెవానిఁ గాంచి పలికె నిట్లు:

“దప్పి గొంటి, జలము త్రాగి వచ్చెద ని ప్డె,
అరయుచుండు మయ్య యంతదనుక
మేఁకపిల్ల దీని నీకడ నుంచెద-
ఇట్టు నట్టు పరుగులె త్తకుండ.”

అనుచు గొల్లవాఁడు తనతోడఁ బలుకంగ,
పల్లెవాఁడు తాను బధిరుఁ డగుట
వాని మాట లించుకేనియుఁ దెలియక
సరియె యంచు నట్టె శిరము నూఁపె.

35