పుట:మధుర గీతికలు.pdf/214

ఈ పుట ఆమోదించబడ్డది


ఎన్నరానట్టి దురవస్థ యెదియొ నాకు
కల్గె నని మీరు ననుగూర్చి మూల్గఁ నేల?
ఇట్టి దని నేను మదిని నూహింపరాని
కష్ట మవలీల సహియింపఁ గలను సుమ్మి.

దుర్లభం బగుదానికై దుఃఖ మొంది
చెఱతు రేటికి మీరు నా చిత్తశాంతి?
మీకు మ్రొక్కెద నాజోలి రాకుఁ డయ్య
గ్రుడ్డి నయ్యును దేవుని బిడ్డఁ గానె?

కోరి నాకయి దైవంబు కూర్చినట్టి
దెట్టిదైన వరంబుగా నెంచికొందు;
కనులు గల్గియు గ్రుడ్డియై మనుటకంటె
గ్రుడ్డి యయ్యు వివేకంబు గొనుట మేలు.

వింతవింత పదార్థముల్‌ గాంతు మంచు
చెప్పుచుందురు జను లెల్ల చిత్రముగను;
చూతురే కాని వానిని స్థూలదృష్టి,
సూక్ష్మదృష్టిని నావలె చూడఁగలరె?

33