పుట:మధుర గీతికలు.pdf/213

ఈ పుట ఆమోదించబడ్డది

అంధ బాలుఁడు


దేని వెలుఁ గని పిలుతురో, నేను నిరత
మనుభవింపఁగరాని పదార్థ మేదొ
ఏమి లాభంబు కలుగునో దృష్టివలన,
పలుకుమీ సఖ: ఈ యంధ జాలకునకు.

వేయికాంతుల భానుండు వెలుఁగు ననుచు
అఖిలజనులును చెప్పుదు, రతఁడు వేడి
యనుచు నే నెఱుఁగుదుఁ గాని, యాతఁ డెట్లు
రేయి పగలును గావించునో యెఱుంగ.

పగలు రే యని వింతగాఁ బలుకుచుందు,
పగలు రేయియు నా కొకపగిదిఁ దోచు;
ఏను మేల్కొనియున్నప్పు డెల్ల పగలు,
ఏను నిద్రించి యున్నప్పు డెల్ల రేయి.

32